నటి పవిత్రను నాలుగో వివాహం చేసుకోబోతున్న నటుడు నరేశ్‌పై అతడి మూడో భార్య రమ్య తీవ్ర ఆరోపణలు చేశారు. నరేశ్ చాలా క్రూరుడని, తన క్యారెక్టర్ బ్యాడ్ చేసేందుకు ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు అంటగట్టేవాడని ఆరోపించారు. నరేశ్ తండ్రి,తనకు కూడా తండ్రి సమానుడైన సూపర్ స్టార్ కృష్ణతో కూడా తనకు అక్రమ సంబంధం అంటగడుతూ కోర్టులో కేసు వేశాడని రమ్య రఘుపతి ఆరోపించారు. అప్పటికే భార్య విజయ నిర్మల, కొడుకు రమేశ్ బాబును పోగొట్టుకున్న బాధలో ఉన్న కృష్ణ గారికి ఈ విషయం చెప్పి బాధించడం ఇష్టం లేక తాను చెప్పలేదని వివరించారు. Read More