కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సహకరించడం అంటే దేశానికి సహకరించినట్లే అని వివరించారు. 8 ఏళ్ల ప్రగతి ప్రస్థానంతో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పథకాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని లేఖలో కేటీఆర్ కోరారు. ఈనెల 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.