దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన LIC ఐపీఓ షేర్స్ నేడు కేటాయించారు. ఈ ఐపీఓలో పాల్గొన్న ఇన్వెస్టర్లు BSE వెబ్‌సైట్ లేదా IPO రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో తమ షేర్‌కు సంబంధించిన వివరాలను తనిఖీ చేయొచ్చు. మే 16న ఈ షేర్స్‌ను డీమ్యాట్ అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా మార్కెట్ల పరిస్థితుల కారణంగా ఇష్యూ పరిమాణంలో సుమారు 60 శాతం వరకు LIC తగ్గించుకుంది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఐపీఓకు భారీగా రెస్పాన్స్ వచ్చింది.