హైదరాబాద్లో వేతనాలు పెంచాలని సినీ కార్మికులు, ఫిలిం ఫెడరేషన్ తో చేసిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో రేపటి నుంచి యధావిధిగా షూటింగ్లకు సినీ కార్మికులు హాజరు కానున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకుని మండలితో చర్చించారు. దీంతో కార్మిక వేతనాలపై దిల్ రాజ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాతల మండలి తెలిపింది. మరోవైపు శుక్రవారం జరిగే భేటీలో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. వేతనాలు పెంచుతామని చెప్పడంతో సినీ కార్మికులు సమ్మతించారు.