ఫిబ్రవరి 14కల్లా ప్రతి విద్యార్థికి ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండాలని ఓ కాలేజీ కండీషన్ పెట్టింది. ఈ మేరకు జారీ అయిన నోటీసు కాపీ నెట్టింట వైరల్ అవుతోంది. ఒడిశాకు చెందిన ఓ అటానమస్ కాలేజీ నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు కనిపించింది. ‘ప్రతి అమ్మాయికి కనీసం ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. లేదంటే కాలేజీలోకి నో ఎంట్రీ’ అంటూ నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్.. ఇది ఫేక్ నోటీసు అని చెప్పారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇలా చేసినట్లు పోలీసులకు తెలిపారు. కాలేజీకి అప్రతిష్ఠ తీసుకు రావాలనే దుండగులు ఈ నీచానికి పాల్పడ్డారని ప్రిన్సిపల్ ఆరోపించారు.