• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun Arrest: హైకోర్టులో అల్లు అర్జున్‌కు బిగ్‌ రిలీఫ్‌.. మధ్యంతర బెయిల్‌ మంజూరు

    పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ (Allu Arjun)కు బిగ్‌ షాక్‌ తగిలింది. పుష్ప 2 ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల ఆయన్ను అరెస్టు చేశారు. బన్నీ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసుకు సంబంధించి బన్నీపై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

    బన్నీకి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

    నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం బన్నీకి బెయిల్ ఇచ్చేందుకు మెుగ్గు చూపింది. ఈ కేసులో బన్నీపై పెట్టిన సెక్షన్లు అతడికి వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. యాక్టర్‌ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు లభించకుండా పోవని కోర్టు అభిప్రాయపడింది. అల్లు అర్జున్‌కు జీవించే హక్కు ఉందని స్పష్టం చేసింది. రేవతి కుటుంబంపై తమకూ సానుభూతి ఉందని అంతమాత్రాన నేరాన్ని వ్యక్తులపై రుద్దలేమని హైకోర్టు పేర్కొంది.

    బన్నీకి రిమాండ్‌

    అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. అక్కడ గంటపాటు ఈ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్‌ విచారణ జరిపారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయమూర్తి బన్నీని రిమాండ్‌కు అనుమతిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. 14 రోజులపాటు రిమాండ్‌ విధిస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు కేసు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశామని, విచారణ జరుగుతోందని బన్నీ తరపు లాయర్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

    చంచల్‌గూడా జైలుకి బన్నీ!

    నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా అల్లు అర్జున్‌ను చంచల్‌ గూడా జైలుకు తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంచల్‌ గూడా జైలు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    ‘కేసు వెనక్కి తీసుకుంటా’

    సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించే బన్నీని అరెస్టు చేశారు. దీనిపై రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ‘నా కుమారుడు సంధ్యా థియేటర్‌లో పుష్ప 2 సినిమా చూస్తా అంటే తీసుకెళ్లా. అక్కడ అల్లు అర్జున్‌ వచ్చినందుకు ఆయన తప్పేమి లేదు. మేము ఏమన్నా ఉంటే కేసు విత్‌డ్రా చేసుకోవడానికి  రెడీగా ఉన్నా. బన్నీని  అరెస్టు చేస్తున్నట్లు పోలీసు వాళ్లు నాకు ఇన్‌ఫామ్‌ చేయలేదు. మెుబైల్‌లో చూసి తెలుసున్నా. అల్లు అర్జున్‌కైతే ఏమి సంబంధం లేదు’ అని చెప్పుకొచ్చారు. కాగా, రేవతి కుమారుడు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    రిమాండ్‌ రిపోర్టు సిద్ధం

    అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest)ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించిన అధికారులు అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల నిర్వహించిన తర్వాత బన్నీని కోర్టు ఎదుట హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బన్నీ రిమాండ్‌ రిపోర్టును సైతం పోలీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బన్నీని రిమాండ్‌లోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు స్టేషన్‌లో అల్లు అర్జున్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం.

    బన్నీ అసహనం

    అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై  అల్లు అర్జున్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నపళంగా రమ్మంటే ఎలా అని ఆయన పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా బన్నీ మండిపడ్డట్లు తెలుస్తోంది. తనను తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కానీ, తీసుకెళ్లిన విధానం మాత్రం బాలేదని బన్నీ కొప్పడినట్లు తెలుస్తోంది. కాగా, బన్నీ అరెస్టు నేపథ్యంలో చిక్కడపల్లి పోలుసు స్టేషన్‌కు తండ్రి అరవింద్‌తో పాటు, సోదరుడు శిరీష్‌ చేరుకున్నారు. 

    కేసుకు కారణాలు ఇవే!

    సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ (Allu Arjun)పై కేసు పెట్టినట్టు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై సైతం సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రీమియర్స్‌ సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్‌ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకపోగా పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

    సెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

    అల్లు అర్జున్‌పై నమోదు చేసిన 105, 118 (1) సెక్షన్స్‌ లీగల్‌గా చాలా స్ట్రాంగ్‌ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 105ను ప్రాణ నష్టం కేసు లేదా హత్య కింత పరిగణిస్తారని తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణం పోవడంలో పరోక్షంగా అతడి ప్రమేయం ఉన్నందున ఈ సెక్షన్‌కు బన్నీ బాథ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో సెక్షన్ 118(1) ‘నేరాన్ని ప్రేరేపించారు’ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతుందని అంటున్నారు. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకొని నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని చెబుతున్నారు.

    రూ.25 లక్షల సాయం

    ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) స్పందించారు. స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని బన్నీ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయిందని తెలియగానే తనతో పాటు మూవీ టీమ్‌ అంతా షాకైందని చెప్పారు. ఫ్యాన్స్‌తో సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని బన్నీ అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఈ ఘటనతో తమని ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. తన తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. మృతురాలి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv