వరుడు సినిమా హీరోయిన్ భాను శ్రీ అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీతో నటించినప్పటికీ తనకు ఎలాంటి అవకాశాలు రాలేదన్నారు. “ అల్లు అర్జున్‌తో కలిసి వరుడు సినిమాలో నటించాను. అయినప్పటికీ నాకెలాంటి అవకాశాలు రాలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మరీ, ముఖ్యంగా తను నన్ను ట్విటర్‌లో బ్లాక్ చేశాడని తెలుసుకున్నా” అన్నారు.ఏమయ్యిందంటూ నెటిజన్లు ప్రశ్నించిన కాసేపటికి “ గ్రేట్..బన్నీ నన్ను అన్‌బ్లాక్ చేశాడు !! నా కెరీర్ పరాజయానికి నేను ఆయన్ను ఎప్పుడూ నిందించలేదు” అన్నారు.