ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటుడు నవదీప్ మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు కూడా. ప్రస్తుతం నవదీప్ అంతగా సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. అయితే తాజాగా నవదీప్ పోస్ట్ చేసిన ఓ స్టోరీ వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ తనకు ఎయిర్‌పాడ్స్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఆయన స్టోరీ పెట్టాడు. దానికి ‘థాంక్యూ బావ, ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పాడ్స్ వాడుతా’ అని కాప్షన్ పెట్టాడు.