అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లోనూ రూ.100 కోట్లు కలెక్ట్ చేయడంతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ ఈ కార్యక్రమం జరిగింది. దీనికి బన్నీ మేనమామ మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ లతో పాటు బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ హాజరయ్యారు.