‘మేజర్’ మూవీపై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేజర్ మూవీ గురించి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. మనసుకు హత్తుకునే సినిమాను తీశారని అన్నారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్కాను పొగిడారు. అడివిశేష్ మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడని మెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు మహేశ్‌బాబుపై గౌరవంగా ఉందని తెలిపాడు. దీనిపై స్పందించిన మహేశ్..బన్నీకి దన్యవాదాలు తెలియజేశాడు. నీ ప్రశంసలు మేజర్ టీమ్‌కు ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నాడు. అల్లు అర్జున్ ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.
Thank you @alluarjun! Your words will surely encourage the young team of #Major. Happy to know that you loved the film ♥️ https://t.co/UVLHEQygcg
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2022