హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అమయ్ కుమార్ను నియమిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్కు హైదరాబాద్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉన్న ఎల్.శర్మన్ నేడు(జూన్ 30న) పదవీ విరమణ పొందనున్నారు. దీంతో అమయ్ కుమార్కు బాధ్యతలను కట్టిబెట్టారు.