అమెజాన్.. ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. దాదాపు 18 వేల ఉద్యోగులకు ఉద్వాసన పత్రాలు జారీ చేస్తోంది. ఎక్కువ రిటైల్ డివిజన్,హెచ్‌ఆర్ విభాగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. కాస్ట్ కట్టింగ్ నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ అమ్మకాల వృద్ధి తగ్గడం. ఆర్థిక మాంద్యం భయాలు, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడం కారణంగా లేఆఫ్స్ చేస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.