ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రముఖ మూవీ స్టూడియోస్ అయిన MGM స్టూడియోను కొనుగోలు చేసింది. 8.5 బిలియన్ డాలర్లతో ఈ కొనుగోలు ఒప్పందం జరిగినట్లు అమెజాన్ గురువారం తెలిపింది. జేమ్స్ బాండ్ వంటి ఎన్నో దిగ్గజ చిత్రాలను నిర్మించిన MGM స్టూడియో కొనుగోలతో స్ట్రీమింగ్ రంగంలో రాణించొచ్చని అమెజాన్ భావిస్తోంది. ప్రస్తుతం ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ వారి వారి ఉద్యోగాలలో కొనసాగిస్తామని తెలిపిన అమెజాన్, MGM కంటెంట్‌ను అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందించి, వారిని ఆకర్షించాలని చూస్తోంది.