ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన ఇండియన్ భాగస్వామి ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌పై కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్, అమెజాన్ రెండు సంస్థలు గత సంవత్సర కాలంగా చట్టపరమైన నిబంధనలో ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ తమ కంపెనీని రిలయన్స్‌కు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో, ఫ్యూచర్ గ్రూప్‌పై కేసు నమోదు చేసేందుకు అమెజాన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇండియాలో తమ రిటైల్ మార్కెట్ విస్తరించేందుకు రిలియన్స్, ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.