అమెజాన్ ప్రైమ్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇటీవల సబ్‌స్క్రిప్షన్‌ను అమాంతం రూ. 1499కి పెంచడంతో వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. దీంతో వారి కోసం అమెజాన్ ప్రైమ్ లైట్‌ను తీసుకువస్తున్నారు. దీని ధర రూ. 999 ఉంటుందని సమాచారం. కాకపోతే కొన్ని మినహాయింపులు ఉంటాయంట. ప్రస్తుతం ఎంపిక చేసిన యూజర్లతో టెస్టింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దశలవారీగా భారత్‌లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.