AP: వచ్చే ఏడాది విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కుల, మత, ప్రాంతాలు కలిగిన భారతావనికి క్రమశిక్షణ నేర్పింది రాజ్యాంగమేనని కొనియాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త అని సీఎం చెప్పారు. ఏపీలో గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించామన్నారు.