హైదరాబాద్ అంబర్పేట సీఐ సుధాకర్ని అరెస్ట్ చేశారు. భూమి వ్యవహారానికి సంబంధించిన కేసులో వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్కు తరలించనున్నారు. కొన్ని రోజుల క్రితం సీఐపై కేసు నమోదు అయ్యింది. ఓ ప్రవాస భారతీయుడికి భూమి ఇస్తానని నమ్మించి రూ. 50 లక్షలు తీసుకున్నాడట. కందుకూరు గ్రామంలో వ్యవసాయ భూమి విక్రయిస్తామని చెప్పి రిజస్ట్రేషన్ చేయలేదని సమాచారం. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.