భాగ్యనగరంలో ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ కాన్సులేట్ భవనం ఏర్పాటవుతుంది. 12.2 ఎకరాల్లో రూ.2,251 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. నవంబర్‌లోగా అందుబాటులోకి వచ్చే ఈ కేంద్రం ద్వారా ఇకపై అమెరికా వీసాలు పొందడం సులభతరం అవుతుంది. వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూలు త్వరగా పూర్తవుతాయి. 2008 నుంచి ఈ సంస్థ హైదరాబాద్‌లోని పాయిగా ప్యాలెస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. ప్రభుత్వం స్థలం కేటాయించడంతో నానక్‌రాంగూడలో సొంత భవనం నిర్మిస్తున్నట్లు అమెరికన్ కాన్సులేట్ అధికార ప్రతినిధి డేవిడ్ మోయర్ పేర్కొన్నారు.