నవ్వు నలు విధాలు అన్నట్లు..అభిమానం అరవై రకాలు అనేలా ఉంది ఈ సంఘటన. ఆదిత్య కుమార్ సింగ్ అనే ఓ క్రికెటాభిమాని ‘ నా గర్ల్ ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్తాను ఓ 300 రూపాయలు ఇవ్వండి సార్’ అంటూ క్రికెటర్ అమిత్ మిశ్రాకు ట్వీట్ చేేశాడు. ఇలాంటి చిలిపి కోరికలు చాలామందే కోరుతుంటారు అనుకోండి. కాకపోతే ఇక్కడ మిశ్రా స్పందించిన తీరుపై నెటిజన్లు వావ్ అంటున్నారు. ‘ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డేట్ బ్రదర్’ అంటూ అమిత్ మిశ్రా అతడికి రూ.500 పంపించాడు. దీంతో థ్యాంక్యూ సర్ అంటూ ఆ అభిమాని ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
అభిమాని లవ్ కోసం రూ.500 ఇచ్చిన అమిత్ మిశ్రా

Screengrab Twitter