ఈ వారాంతంలో ఇంగ్లండ్తో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ కోసం ఇండియన్ హాకీ టీం సిద్ధమైంది. 22 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు అమిత్ రోహిదాస్ కెప్టెన్గా తిరిగి నియామకం అయ్యాడు. గతంలో పలు టోర్నీల్లో ఇండియన్ టీంకు ఇతను నాయకత్వం వహించాడు. 23 ఏళ్ల అమిత్ హాకీ ఇండియా ప్రకటించిన జట్టులో వరుణ్ కుమార్ స్థానంలో వచ్చాడు. మరోవైపు డిఫెండర్ నీలం సంజీప్ కూడా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.