తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా వ్యూహాలు రచిస్తోంది. దక్షిణాదిలోనూ పాగా వేసి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి అమిత్ షా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను బట్టి మహబూబ్నగర్ నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ నేతలతో భాజపా ముఖ్యులు చర్చించారట.