తెలంగాణ రాజకీయాలపై బీజేపీ అధిష్ఠానం మరింత శ్రద్ధ తీసుకుంటోంది. ఈ మేరకు పార్టీలోని పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నెల 19న ప్రధాని పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. పార్టీలోని సంస్థాగత అంశాలే ప్రధాన ఎజెండాగా వివిధ స్థాయుల్లోని బీజేపీ నేతలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నట్లు టాక్.