జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బెంజ్, ఇన్నోవా కార్లు తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. మొయినాబాద్ లో ఇన్నోవా దొరికిన ఇల్లు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ దని గుర్తించిన పోలీసులు… సదరు ఛైర్మన్ ను విచారించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు కాగా… మరో నిందితుడు ఉమర్ ఖాన్ కోసం గాలిస్తున్నారు.