తెలంగాణలో ఆర్టీసీ మరోసారి చార్జీల మోత మోగించింది. ప్రతి టికెట్ పై రూ.5 నుంచి రూ.170 వరకు సెస్ వాత పెట్టింది. దీంతో ఆర్టీసీకి ఏటా 150 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. పల్లె వెలుగులో తొలిస్టాప్ చార్జీ రూ.10 అలాగే ఉంచారు. రెండో స్టాప్ చార్జీకి రూ.15 నుంచి రూ. 20కి పెంచారు. పల్లె వెలుగులో గరిష్ఠంగా రూ.30 పెరగనుంది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.5 నుంచి రూ.90, డీలక్స్ బస్సుల్లో రూ.5 నుంచి రూ.125 వరకు పెంచారు. సూపర్ డీలక్స్ సర్వీసుల్లో రూ. 10 మొదలు రూ.135 వరకు చార్జీలు పెరిగాయి. బస్ పాస్ ల ధరలు దాదాపుగా మూడింతలకు పెంచారు.పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.