నటి ఎమీజాక్సన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు బిజినెస్‌మ్యాన్ జార్జ్ పనాయోటోతో కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఎమీజాక్సన్ ప్రియుడిని పక్కన పెట్టి మరో నటుడితో రొమాన్స్ చేస్తుంది. గాసిప్ గర్ల్ అనే వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయిన ఎడ్ వెస్ట్‌విక్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి ప్రియుడితో పాటు ఆమె ఫాలోవర్స్‌కు షాక్ ఇచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ప్రియుడిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ఎమీజాక్సన్ ఇప్పుడు ఇలాంటి ఫోటోలు షేర్ చేయడానికి ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలే కారణమని అనుకుంటున్నారు.