RRR మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో నిర్వహించేందుకు టీం అన్ని ఏర్పాట్లను చేసింది. కాసేపట్లో ఈ ఈవెంట్ మొదలవుతుందని అనుకునే లోపల అక్కడ ఓ అపశృతి చోటు చేసుకుంది. చాలా మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా రావడంతో.. అక్కడ ఉన్న పోలీసులకు అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో వారు చేతులెత్తేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ సభాస్థలి వద్దకు వచ్చారు. దీంతో అక్కడ వేసిన కుర్చీలన్నీ విరిగిపోయాయి.