ప్రముఖ నటికి యాక్సిడెంట్

అమెరికాకు చెందిన ప్రముఖ నటి అనీ హీచ్ రోడ్డు ప్రమాదానికిి గురయ్యారు. లాస్ ఏంజెల్స్ లో కారు రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్రంగా మంటలు చెలరేగడంతో ఆమె గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనీ హీచ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 1990ల్లో “సిక్స్ డేస్, సెవెన్ నైట్స్,” “డానీ బ్రాస్కో” ” ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్” వంటి సినిమాల్లో అనీ హీచ్ నటించారు. పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు.

Exit mobile version