స్పామ్ కాల్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు ట్రూకాలర్ యాప్ మరో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ‘గవర్నర్ డిజిటల్ డైరెక్టరీ’ పేరుతో కాంటాక్టుల జాబితాను సిద్ధం చేసింది. దీంతో అధికారులమంటూ కాల్ చేసే మోసగాళ్లను సులువుగా గుర్తించొచ్చని పేర్కొంది. కేంద్రప్రభుత్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధుల నెంబర్లు డైరెక్టరీలో పొందపర్చింది. వీరి నుంచి ఫోన్ వచ్చినప్పుడు స్క్రీన్ బ్యాక్‌గ్రౌండులో గ్రీన్ కలర్‌లోనూ, కాంటాక్టు పేరు పక్కన బ్లూ టిక్ కనిపిస్తుంది. ఇలా కనిపించకపోతే అది స్పామ్ కాల్ కింద పరిగణించాలని సూచించింది. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్‌ని అప్డేట్ చేసుకుని ఈ ఫీచర్‌ని పొందవచ్చు.