తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ఓ యాప్‌ను అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే యాప్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి ఇలా అన్నిరకాల సేవలను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కాగా గతంలో గోవింద యాప్‌ను తీసుకొచ్చినా అది భక్తులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దానిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఈ యాప్‌ను తీసుకొస్తున్నారు.