ఐఫోన్ కొనాలంటే లక్ష రూపాయలకు అటో ఇటో కావాలి. అంత పెట్టి కొనే స్థోమత మధ్య తరగతి వాళ్లకు ఉండవు. ఇటీవల యాపిల్ నుంచి విడుదలై ఐఫోన్ 14pro పట్ల కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. రేటు కూడా బాగానే ఉంది. సరిగ్గా ఐఫోన్ 14proను పోలిన మరో మెుబైల్ మార్కెట్లోకి వస్తోంది. LeEco S1 Pro అనే స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్లు షురూ అయ్యాయి. ఇందులో 8జీబీ+128జీబీ మోడల్ ధర సుమారుగా రూ. 10,900లు మాత్రమే ఉంది.