హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ గ్రామ వాసి అని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.
**జీవితం విలువైనది ఆత్మహత్య ఆలోచనలు దరి చేరనీయకండి. సాయం కోసం 9152987821 ను సంప్రదించండి.
**