ఓ వృద్ధురాలు చనిపోయిందని శ్మశానానికి తీసుకువెళ్తుండగా కళ్లు తెరిచింది. ఈ ఘటన యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా బిలాస్పూర్లో జరిగింది. గ్రామానికి చెందిన హరిభేజి(80) అనే వృద్ధురాలు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆస్పత్రిలో మరణించింది. మర్నాడు కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్లగా.. అక్కడ హఠాత్తుగా కళ్లు తెరిచింది. దీంతో ఆమె కుటుంబసభ్యుల ఆనందా నికి అవధులు లేకుండాపోయాయి. కానీ మరుసటి రోజే వృద్ధురాలు మరణించింది.