TS: ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి విచారణలో పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ఘటనకు నెల రోజుల ముందు కూడా స్మితా సబర్వాల్‌ని చూడటానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. స్మిత ట్విటర్ అకౌంట్‌ని ఫాలో అవుతూ కొన్ని ట్వీట్లకు షేక్స్పియర్ సూక్తులను కోట్ చేసేవాడట. నెల రోజుల క్రితం ఒక్కడే వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 19న ఆనంద్ కుమార్ రెడ్డి తన స్నేహితుడు బాబాతో కలిసి స్మిత ఇంట్లోకి చొరడబడ్డాడు. ఆఫీసర్ కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది ఆనంద్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు.