కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు బాధాకరమని పేర్కొన్నారు. అగ్నిపథ్‌లో చేరిన అగ్నివీరులను మహీంద్రా కంపెనీల్లో తీసుకునేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని, కార్పొరేట్ రంగంలో అగ్నివీరులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.