ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది. ప్రేయసి రాధిక మర్చెంట్‌ని అనంత్ పెళ్లి చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌లోని నాథ్వారాలోని శ్రీనాథ్ జీ ఆలయంలో ఈ జంట నిఖా పక్కా అయింది. ఈ మేరకు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో అనంత్ పాల్గొన్నారు. అనంత్ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనర్జీ డివిజన్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ కంపెనీలో రాధిక బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి నిశ్చితార్థాన్ని ధ్రువీకరిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ బోర్డ్ డైరెక్టర్ నాథ్వానీ ఓ ప్రకటన చేశారు. అయితే, పెళ్లి తేదీ, వేడుకల వివరాలు మాత్రం వెల్లడించలేదు.