‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి’ పాటతో పాటు ఆ హుక్ స్టెప్ ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆ స్టెప్‌ను వేస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. అయితే తాజాగా అనన్య పాండే రష్మికలా సామి సామి అని డ్యాన్స్ చేసింది. ఐఫా 2022 అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న అనన్య హోటల్ రూమ్‌లో ఈ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సారా అలీఖాన్‌తో పాటు ఇతర స్నేహితులు కూడా సందడి చేశారు.
https://youtube.com/watch?v=-21W8o8w7AE