‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌ను ఆద‌రించ‌రు’

సినీ ఇండ‌స్ట్రీలో హీరో చేసే క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల‌కు ఉన్నంత క్రేజ్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఉండ‌దు. టాప్ హీరోయిన్స్ సినిమాలు అయితే త‌ప్ప వాటిని పట్టించుకోరు. హీరోయిన్స్‌కు కెరీర్ కూడా త‌క్కువే. అయితే ఈ విష‌యంపై ఇప్ప‌టిక‌కే దీపికా ప‌దుకొణే, తాప్సీ లాంటి వారు బ‌హిరంగంగానే కామెంట్స్ చేశారు. తాజాగా యువ న‌టి లైగ‌ర్ భామ అనన్య పాండే కూడా దీనిపై స్పందించింది. ఒక‌వేళ ధైర్యం చేసి క‌థానాయిక‌లు ఏదైనా కొత్త‌గా చేసినా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భించ‌దు. అదే ఒక హీరో అలాంటి ప్ర‌య‌త్నం చేస్తే దానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. ఒక హీరోకు, హీరోయిన్‌కు ఎందుకింత వ్య‌త్యాసం ఉంటుందో అర్థం కావ‌ట్లేదు. హీరోయిన్ కేవ‌లం కొన్ని పాత్ర‌ల‌కే ప‌రిమితం అవుతుంద‌నిపిస్తుంద‌ని త‌న‌ మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది.

Exit mobile version