‘పుష్ప’ సినిమాలో యాంకర్ అనసూయ సునీల్ భార్య దాక్షాయణిగా నెగెటివ్ రోల్లో కనిపించింది. అయితే మొదటి భాగంలో ఆమె నిడివి తక్కువే ఉన్నప్పటికీ రెంబో భాగంలో అనసూయ పాత్ర కీలకంగా మారనుందట. బలమైన విలన్ పాత్రలో ఆమె కనిపించబోతుందని టాక్. దీనిపై దర్శకుడు సుకుమార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని సమాచారం. ఫాహద్ ఫాజిల్ నటించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కూడా పుష్ప2లో గుర్తుండిపోయేలా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ భార్యగా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ను ఈ ఏడాది డిసెంబర్లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.