జబర్థస్త్ షో నుంచి నాగబాబు, రోజా వెళ్లిపోయినప్పటినుంచి అది అంతంత మాత్రంగానే నడుస్తుంది. ఇటీవల సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆది వంటి మంచి కమెడియన్స్ కూడా జబర్థస్త్‌ను వీడారు. మల్లెమాల యాజమాన్యం జబర్థస్త్ నటులకు చాలా కండీషన్స్ పెడుతుందట. ఆ చానల్లో కనిపించేవాళ్లు ఇంకెక్కడా షోలు చేయకూడదని, మధ్యలో వెళ్లిపోతే డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకుంటుందని సమాచారం. అందుకే ఆ కండీషన్స్‌కు తలొగ్గి ఉండలేక షో నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా యాంకర్ అనసూయ కూడా జబర్థస్త్‌కు గుడ్ బై చెప్పడంతో షో నిర్వాహకులకు షాక్ తగిలింది. ఇక జబర్థస్త్ కు ఉన్న అట్రాక్షన్ మొత్తం పోవడంతో షో పని అయిపోయినట్లేనని చర్చలు నడుస్తున్నాయి.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం