మూగజీవాల క్షేమం కోసం పాటుపడే యాంకర్ రష్మి కోడి పందేలపై ఫైర్ అయ్యారు. దీనిపై నెటిజన్లతో వాగ్వాదం పెట్టుకున్నారు. రెండు పందేల్లో గెలిచానంటూ ఓ వైద్యుడు పెట్టిన పోస్టును షేర్ చేసిన రష్మి… డిగ్రీని మురికి గుంటలో వేసి డాక్టర్ హింసను ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి చెత్త పనులు చేస్తూ జనాలు గర్వంగా భావిస్తుంటారని పేర్కొంది. దీనిని నెటిజన్లు వ్యతిరేకించారు. కోడికి లేని బాధ మీకెందుకు అని కామెంట్లు పెట్టారు. దీనిపై స్పందించిన ఆమె… కోడికి బాధలేదని నీకు ఎవరూ చెప్పారంటూ ప్రశ్నించింది.
-
Screengrab Instagram:rashmi gautam -
Screengrab Instagram:rashmi gautam