దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ పట్టుబడినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిటిజెన్స్ విడుదల చేసిన ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. 2021-22లో ఏపీలో 18 వేల కిలోలకుపైగా డ్రగ్స్ పట్టుబడినట్లు, 90 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఏపీ తర్వాతి స్థానాల్లో త్రిపుర(10,104), అస్సాం(3,633), తెలంగాణ(1,012), చత్తీస్గఢ్(830) ఉన్నాయి. ఇక ఏపీలో 1,057 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రూ.100 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.