అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా RRR ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్‌ను శరవేగంగా చేపడుతోంది. అయితే ఈ సినిమా టిక్కెట్లను పెంచుకుంటామని డైరెక్టర్ రాజమౌళి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. పది రోజుల పాటు రూ.75 మేర సినిమా టికెట్ ధరను పెంచుకోవచ్చని అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. దీంతో RRR మేకర్స్ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.