మొబైల్ మార్కెట్లో ఆండ్రాయిడ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కనిపిస్తూ ఉంటుంది. సరికొత్త ఫీచర్లతో, వినియోగదారులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఆండ్రాయిడ్ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 అందుబాటులో ఉండగా.. త్వరలోనే ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఇందులో ప్రైవసీ, సెక్యూరిటీ మెరుగు పరచడం, UI డిఫరెంట్ లుక్ తీసుకురావడం, యాప్ ఐకాన్స్‌కి కలర్ చేంజ్ చేయడం, ఆటో-డిలీట్ క్లిప్‌బోర్డ్ ఇలా ఎన్నో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి ఉండనున్నాయట.