కర్నూల్ జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సాటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమారుడిని అంగన్వాడీ బడిలో చేర్పించి ఆదర్శాన్ని చాటారు. స్వతహాగా ఆర్భాటాలకు దూరంగా ఉండే కోటేశ్వరరావు తన బిడ్డను ప్రభుత్వ ప్రీ స్కూల్ లో చేర్పించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. కోటేశ్వరరావు భార్య స్వర్ణలత హైదరాబాద్‌లో ఓ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.