TS: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టును భర్త బ్రదర్ అనిల్ ఖండించారు. ఓ మహిళానేతలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు ధ్వంసం చేసిన వారిపై కాకుండా, బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులు నమోదు చేసిన కేసులపై న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. షర్మిల ఒక ఫైటర్ అని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కొనియాడారు. మరోవైపు, షర్మిలను నాంపల్లి కోర్టు జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఆమెతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.