న్యూఇయర్ సందర్భంగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డెరెక్ట్ చేస్తున్న యానిమల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌లో రణబీర్ కపూర్ పూర్తి మాస్‌లుక్‌లో కనిపించాడు. వంటి నిండా గాయాలతో గొడ్డలి పట్టుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇంత ఊర మాస్ లుక్‌లో రణబీర్ దర్శనమివ్వడం ఇదే తొలిసారి. ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మంధాన నటిస్తోంది. అనిల్ కపూర్, పరిణతి చోప్రా, శరత్ సక్సెనా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.