తమిళ, తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. తాజాగా ఈయన మ్యూజిక్ ఇచ్చిన బీస్ట్, విక్రమ్ సినిమాలు కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే అనిరుధ్ గురించి ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అనిరుధ్, సింగర్ జోనితా గాంధీతో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. అనిరుధ్‌తో కలిసి హలమతి హబిబో పాట పాడిన జోనితా అతడితో ప్రేమలో పడిందని టాక్ నడుస్తోంది. దీనికి తోడు తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ ఈవెంట్‌లో యాంకర్ కిల్, మ్యారీ, కిస్ ఎవరిని చేస్తారు అని అడిగితే మ్యారీ అనిరుధ్‌ని చేసుకుంటానని జోనితా అనడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: