ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు ఏపీ సర్కార్ అండగా నిలువనుంది. లడ్డుప్రసాదం కోసం టీటీడీ సహా ఇతర ఆలయాలకు పంపిణీ చేసే వారికి కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనపు ప్రీమియ రేటు దక్కేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన 100 మంది రైతులతో తిరుమలలోని శ్వేతభవన్లో శుక్రవారం సమావేశం కానున్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో సాగు మెళకువలతో పాటు సర్టిఫికేషన్ పొందేందుకు పాటించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నారు.
అన్నదాతలకు ఆపన్నహస్తం

© Envato