అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ అవార్డులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలకు 27మందిని ఎంపిక చేసింది. ఈమేరకు సీఎస్ భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది మహిళలకు అవార్డుతో పాటు రూ. లక్ష చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారానికి ఎంపికైన వారిలో పోలీసులు, అంగన్‌వాడీ టీచర్లు, సామాజిక కార్యకర్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు.