గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేలకు పైగా నియామకాలకు ఏపీ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఈ సారి పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు చేపట్టాలని చూస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. 19 కేటగిరీల ఉద్యోగాలకు 19 వేర్వేరు రాత పరీక్షలు నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.